Viveka Murder case: అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్5కు వాయిదా
Avinash Reddy: ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలకు నిరాకరించిన కోర్టు
Viveka Murder case: అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్5కు వాయిదా
Avinash Reddy: వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని వ్యాఖ్యానించింది.
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూన్ 5కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. అత్యవసరమైతే చీఫ్ కోర్టుకు అభ్యర్థించాలని సూచించింది. అయితే అప్పటివరకు అవినాష్‌ను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అవినాష్ తరపు లాయర్లు కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికిప్పుడు వాదనలు వినాలంటూ కోర్టును ఒత్తిడి చేయొద్దని తెలిపారు సీజే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని తెలిపింది.