Harish Rao: ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ట్వీట్లు.. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు
Harish Rao: అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది
Harish Rao: ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ట్వీట్లు.. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు
Harish Rao: స్కీమ్ ల్లోని స్కాం ల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమే నని మంత్రి హరీశ్ రావు ట్వట్టర్లో పేర్కొన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు సాగాయన్నారు. రాసిచ్చిన స్క్రిప్టుతో రాహుల్ గాంధీ.. స్కిట్ నడిపించారని పేర్కొన్నారు.
తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారనే వ్యాఖ్యలపై స్పందించిన హరీశ్ రావు ఎదురు దాడికి దిగారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీదని, అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ... స్కాంగ్రెస్ గా మారిందన్నారు.
బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీం కాదని... పేద ప్రజలకు ఏ టీం లా ఉంటుందని స్పష్టంచేశారు. ప్రజల సంక్షేమం చూసే బిఆర్ఎస్... ఏ క్లాస్ టీంలాంటిదన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్ పుట్టిందని వివరించే ప్రయత్నం చేశారు. ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..