Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు.. కానీ...
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాడని.. ఇదంతా మన దురదృష్టమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు.. కానీ...
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాడని.. ఇదంతా మన దురదృష్టమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోరాటం చెయ్యకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారాయన.. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తాని విమర్శించారు. ఉద్యమ సమయంలో గన్ పట్టుకొని రేవంత్ రెడ్డి ఉద్యమకారులను బెదిరించాడని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నీ అబద్ధాలే చెప్పారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 25 శాతం అవకాశం దక్కేలా ప్రయత్నిస్తానని హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. రెండు పార్టీల నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.