Harish Rao: సీఎం రేవంత్‌ రెడ్డిపై Xవేదికగా హరీష్ రావు విమర్శలు

Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనమని హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా విమర‌్శలు చేశారు.

Update: 2025-10-07 12:41 GMT

Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనమని హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా విమర‌్శలు చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదినే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరించింది లేదు, అమలు చేసింది లేదన్నారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలు అందని దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. జీతాలు ఇవ్వకుండా 13వేల మంది వైద్య సిబ్బందిని దసరా పండుగకు దూరం చేశారని అన్నారు. వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడం దుర్మార్గామన్నారు. అత్యవసర సేవలు అందించే వైద్య సిబ్బందికే జీతాలు ఇవ్వకుంటే, ఇక ఇతర శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. కనీసం ఇప్పుడైనా జీతాలు ఇచ్చి వారికి దీపావళి సంబురాన్ని అందించాలని కోరారు.

Tags:    

Similar News