Harish Rao: రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం

Harish Rao: సీఎం రేవంత్‌ రెడ్డి రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి.. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీష్‌ రావు విమర్శించారు.

Update: 2025-11-20 09:52 GMT

Harish Rao: రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం

Harish Rao: సీఎం రేవంత్‌ రెడ్డి రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి.. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీష్‌ రావు విమర్శించారు. తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ‎ఫార్ములా ‎ఈ రేస్‌లో.. రెండేళ్లుగా కాంగ్రెస్‌ సర్కార్‌ కోడిగుడ్డుపై ఈకలు తీస్తున్నారు అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై.. అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని.. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీమంత్రి హరీష్‌ రావు ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు.

Tags:    

Similar News