Harish Rao: డయాలసిస్ సేవలకు రూ.700 కోట్లు ఖర్చు

Harish Rao: అవయవదానాన్ని ప్రోత్సహించాలి

Update: 2022-12-17 13:48 GMT

Harish Rao: డయాలసిస్ సేవలకు రూ.700 కోట్లు ఖర్చు

Harish Rao: వైద్య రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషిచేస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. నిమ్స్‎లో రెండు కోట్ల వ్యయంతో అందుబాటులోకి తెచ్చిన వైద్య పరికరాలను మంత్రి ప్రారంభించారు. డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్‎గా నిలిచిందన్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 7 వందల కోట్లు ఖర్చుచేశామని హరీష్ రావు చెప్పారు. కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా శుద్ధమైన మంచినీటిని అందిస్తున్నామని వివరించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధానంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు హరీష్ రావు. వ్యాధులు తీవ్రం కాకుండా ప్రాథమిక దశలోని గుర్తించాలన్న మంత్రి.. అవయవదానాన్ని ప్రోత్సహించాలనిసూచించారు.

Tags:    

Similar News