Harish Rao Inaugurated RTPCR Testing Center : సిద్దిపేటలో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ సెంటర్

Harish Rao Inaugurated RTPCR Testing Center : ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ టెస్టుల ల్యాబులను పెంచుంది.

Update: 2020-08-05 09:34 GMT

Harish Rao Inaugurated RTPCR Testing Center : ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ టెస్టుల ల్యాబులను పెంచుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం మరో కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో ఈ కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ ఆర్వీఎం ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ సెంటర్ ని ప్రారంభించినట్లు తెలిపారు. సిద్దిపేట్ అటు చుట్టు పక్కన గ్రామాల ప్రజలంతా ఆర్వీఎం దవాఖానకు వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా బాధితులకు ఆర్వీఎం ఆస్పత్రిలో చాలా వసతులను ఉచితంగా అందిస్తున్నారని ఆయన తెలిపారు. కావున కరోనా భాధితులు ఎవరు కూడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లొద్దని సూచించారు. అలాగే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు.

ఇప్పుడు జిల్లాలో ర్యాపిడ్ టెస్టుల చేసేందుకు ఐదు వేల కిట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. త్వరలో అనుమతుల అనంతరం సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ అనేది మనిషి చనిపోయే రోగం కాదని ఆయన అన్నారు. కరోనా సోకిందని ప్రజలు భయపడకుండా ఆ లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఆర్వీఎం ఆస్పత్రి చైర్మన్ యాకయ్య ఇంత తొందరగా ఈ ఆర్సీపీఆర్ టెస్టింగ్ కోసం ఐసీఎంఆర్ ద్వారా అనుమతులు తెచ్చినందుకు ఆయనను అభినందించారు. 25, వేల రూపాయలతో కూడిన కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.




Tags:    

Similar News