Harish Rao: గవర్నర్ పై హరీష్‌రావు హాట్ హాట్ కామెంట్స్
Harish Rao: గవర్నర్ బిల్లులు ఆమోదించకపోవడంపై ఆగ్రహం
Harish Rao: గవర్నర్ పై హరీష్‌రావు హాట్ హాట్ కామెంట్స్
Harish Rao: గవర్నర్ పై మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ బిల్లుల్ని పెండింగ్ లో పెట్టడం దారుణమని హరీష్‌రావు అన్నారు. కోర్టులో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ కాని పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. మంత్రులు కలిసినా బిల్లులు పాస్ కాని పరిస్థితులున్నాయన్నారు. అన్నివ్యవస్థల్ని బీజేపీ తన అధీనంలో పెట్టుకందన్నారు.
ఫారెస్ట్ యూనివర్సిటీ సంబంధించిన బిల్లును క్యాబినెట్ ఆమోదించిందని. గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి దగ్గర కు పంపడమేమిటని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనని ఆయన అన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ వస్తే ఇబ్బందేమిటో చెప్పాలన్నారు.