Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటరిచ్చారు.
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటరిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదని వివరించారు. కానీ కాంగ్రెస్ వచ్చిన 2 నెల్లలోనే అవగాహన రాహిత్యంతో, తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తినే పరిస్థితి తెచ్చారని హరీష్ రావు ఆరోపించారు.
కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం జరిగిందని.. నెల రోజుల్లోపు 15 అవుట్‌లెట్స్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని మినిట్స్‌లో చెప్పారని హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టులు అప్పగించింది నిజం కాకుంటే ఎందుకు ఖండించలేదని హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.