Harish Rao: కాంగ్రెస్ ఇచ్చిన మాటను తప్పింది
Harish Rao: 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామి ఏమైంది
Harish Rao: కాంగ్రెస్ ఇచ్చిన మాటను తప్పింది
Harish Rao: కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హరీశ్ రావు హాజరయ్యారు. ఫిబ్రవరి 1న జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని మాయమాటలు చెప్పారని హరీశ్ రావు దుయ్యబట్టారు.
ఉచిత విద్యుత్ హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపాలా... రేవంత్ రెడ్డికి పంపాలా అని నిలదీశారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమకాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని విమర్శించారు.