Harish Rao: కాంగ్రెస్‌కు ఓటేస్తే మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టే
Harish Rao: కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్
Harish Rao: కాంగ్రెస్‌కు ఓటేస్తే మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టే
Harish Rao: తెలంగాణలో రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టే అన్నారు ఆయన. మెదక్ జిల్లా నర్సాపూర్ BRS ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో 5గంటల కరెంటే ఇస్తున్నామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిజం చెప్పారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని హరీష్ ధ్వజమెత్తారు. రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు.