Harish Rao: ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
Harish Rao: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.
Harish Rao: ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
Harish Rao: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటూ ఆరోపించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శించారు. కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం అన్నారు. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని.. వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా.. బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ప్రభుత్వానికి చలనం వస్తుందా? అని ప్రశ్నించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.