Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు

Update: 2024-12-05 05:02 GMT

Phone tapping case: మాజీమంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు

Police files Case against Former Minister Harish Rao in Panjagutta police station

Harish Rao: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీమంత్రి హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో.. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

పోలీస్ అధికారుల విధులకు ఆటంకం‌ కల్గించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన్ని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు.

Tags:    

Similar News