Telangana: విదేశాలకు వెళ్లిన వారు తిరిగొచ్చి వ్యవసాయం చేస్తున్నారు: హరీష్‌ రావు

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను తగ్గించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2020-01-23 09:41 GMT

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను తగ్గించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నగరంలోని రేడియన్స్ బ్లూ హోటల్లో గురువారం నాబార్డ్‌ సంస్థ రాష్ట్ర సదస్సు 2020 సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోందని అన్నారు.

ప్రభుత్వం రైతులకు అందించిన పథకాల వల్ల రైతులు ఎంతో లాభం పొందుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో హైటెక్ ప్రాక్టీస్ అగ్రికల్చర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని పేర్కొన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అనుకునే వారికి ఇప్పుడు అదే వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు. దీంతో విదేశాలకు వలస వెళ్లిన వారు కూడా తిరిగి తమ గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారని తెలిపారు. టెక్నాలజీతో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు.

అంతే కాకుండా గొల్ల కురుమలకు రూ. 4,500 కోట్లతో 3 లక్షల 75 వేల గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ఫిషరీష్‌లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలించిందన్నారు. నాబార్డ్ సంస్థ వ్యవసాయ రంగంలో మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపైన కూడా దృష్టి సారించాలని సూచించారు.   

Tags:    

Similar News