Hanuman Sobhayatra: హనుమాన్ శోభాయాత్ర కు తొలగిన అడ్డంకులు
Hanuman Sobhayatra: నగరంలో కోవిడ్ నిబంధనలతో హనుమాన్ శోభాయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది.
Hanuman Sobhayatra:(File Image)
Hanuman Sobhayatra: దేశాన్ని కబళిస్తోన్న కరోనా కారణంగా హైదరాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే హనుమాన్ శోభా యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ సంస్ధలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు కోవిడ్ నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో తలపెట్టిన శోభాయత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్.. మంగళవారం గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బన్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్రకు ఏర్పాట్లు చేసుకున్నాయి.
హైకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం హనుమాన్ యాత్రలో 21 మందికి మించి పాల్గొనవద్దని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే శోభాయాత్రకు నిర్వహించాలని ఆదేశించింది. ఈ యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు ఆదేశించింది. . హనుమాన్ శోభాయాత్ర మొత్తాన్ని వీడియో తీసి తమకు నివేదిక సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.