హాజీపూర్‌ హత్య కేసు.. జనవరి 3కు విచారణ వాయిదా

హాజీపూర్‌ అత్యాచారం, హత్య కేసు విచారణ తుది దశకు చేరిన విషయం తెలిసిందే.

Update: 2019-12-26 15:33 GMT
Hajipur Srinivas Reddy

హాజీపూర్‌ అత్యాచారం, హత్య కేసు విచారణ తుది దశకు చేరిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఫోక్సో స్పెషల్‌ కోర్టులో గురువారం పోలీసులు హాజరుపరిచారు. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించారు. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 3కు వాయిదా వేసింది. అలాగే నిందితుడు శ్రీనివాస రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది.

ఈ కేసులో సాక్షులు చెప్పి వాటిని నిందితుడు శ్రీనివాస రెడ్డి అబద్ధాలేనని కోర్టుకు తెలిపాడు. అసలు ఈ కేసులతో సంబంధంలేదని నిందితుడు చెప్పాడు. హత్యకు గురైన బాలిక ఎవరో తెలియదని అన్నాడు. జడ్జి ప్రశ్నలను అడిగే సమయంలో నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు.ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ రెడ్డి తరపున మాట్లాడేందుకు ఎవరైనా ఉన్నారా? కోర్టు ప్రశ్నించగా.. తన కుటుంబ సభ్యులను సాక్షులుగా పిలిపించుకుంటానని శ్రీనివాసరెడ్డి కోర్టుకు విన్నవించుకున్నాడు.

ఈ కేసులో కోర్టు నిందితుడు శ్రీనివాస రెడ్డి పలు ప్రశ్నలు అడిగింది. పోర్న్ వీడియోలు చూస్తావా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదని శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు తెలిపాడు. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో సంబంధం ఉందా అని కోర్టు ప్రశ్నించింది. సువర్ణ ఎవరో తనకు తెలీదని నిందితుడు కోర్టుకు తెలిపాడు. బాలికల దుస్తులపై ఉన్న స్పెర్మ్‌, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్‌ రిపోర్టులో తేలింది దీనిపై నువ్వేమంటావు అని జడ్జి అడగ్గా, ఎస్‌ఓటీ పోలీసులే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఉంటారని నిందితుడు చెప్పినట్టు సమాచారం. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. 


Tags:    

Similar News