హఫీజ్ పేట్ భూముల వివాదంలో కొత్త కోణం.. కిడ్నాప్ కు అసలు పాత్రధారి..

Update: 2021-01-08 12:11 GMT

guntur srinu in bowenpally kidnap case

హఫీజ్ పేట్ భూముల వివాదం కేసులో కొత్త కోణాలు వినిపిస్తున్నాయి. తవ్విన కొద్దీ కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి. కిడ్నాప్ కు సూత్రధారి అఖిల ప్రియ అయినా ప్రధాన పాత్రధారి మాత్రం గుంటూరు శీను అనే పేరు తెరపైకి వచ్చింది. అతగాడి స్వస్థలం కూడా గుంటూరే శ్రీను చాలా కాలం నుంచే భూమా కుటుంబానికి ప్రధాన అనుచరుడుగా పేరు పడ్డాడు.

వృత్తి రీత్యా నడిపేది టీస్టాల్ అయినా ప్రవృత్తి మాత్రం రౌడీయిజం చూసే వాళ్లకి అదో టీ స్టాల్ కానీ బ్యాగ్రౌండ్ మొత్తం రౌడీయిజం సెటిల్మెంట్సే. గుంటూరులో మాదాల శీను పేరు చెబితే గుర్తొచ్చేది సెటిల్మెంట్లే విలాసాలకు, వినోదాలకు , జల్సాలకు అలవాటు పడిన ప్రాణం సరదగా హెలికాప్టర్ లో విహార యాత్రలకు వెళ్లే నైజం. అఖిల ప్రియ భర్త భార్గవ్ కు రైట్ హ్యాండ్ గా పేరు పడ్డ మాదాల శ్రీను పేరు ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో తొలిసారిగా బయటకొచ్చింది. ఆ కేసులో ఏవన్ గా ఉన్నాడు శీను. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కు స్కెచ్ అమలు చేసినది ఇతగాడే. ఏవీ సుబ్బారెడ్డి పై సుపారీ గ్యాంగ్ తో హత్యాయత్నం చేసిన కేసులో గత ఏడాది మే12న కడప చిన్న చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ కు చేరువైన శ్రీను అతగాడికి పిఏ గా కూడా పనిచేశాడు. ఏవీ సుబ్బారెడ్డి హత్య కోసం సుపారీ గ్యాంగ్ కు 50 లక్షలు పేమెంట్ చేసినది కూడా శీనే ఇప్పుడు అదే కేసులో బెయిల్ పై ఉన్నాడు. భూమా అఖిల ప్రియ కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా శ్రీను పేరు తెచ్చుకున్నాడు.

Tags:    

Similar News