ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన గెస్ట్ లెక్చరర్లు.. హై కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్
Telangana: వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన గెస్ట్ లెక్చరర్లు.. హై కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్
Telangana: హైకోర్టు ఆదేశాల మేరకు తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి లోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు ఇంటర్ గెస్ట్ లెక్చరర్లు. హై కోర్ట్ ఆదేశాలను పట్టించుకోని ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలిగించిన 1654 మంది లెక్చరర్లను వెంటనే రెన్యూవల్ చెయ్యాలని కోరారు. గత పదేళ్లుగా తమతో వెట్టిచాకిరి చేయించుకొని ఇప్పుడు తొలిగించి కొత్త వాళ్ళను తీసుకుంటున్నారని గెస్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామినిచ్చి విస్మరించారని ఆరోపించారు. తమను విధుల్లోకి తీసుకొనేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని గెస్ట్ లెక్చరర్లు.హెచ్చరించారు.