మేడారం సమ్మక్క, సారలమ్మల సన్నిధిలో భక్తుల తాకిడి

*గురువారం సమ్మక్క గద్దెకు వచ్చే రోజు కావడంతో భక్తుల రద్దీ *రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తుల రాక *పిల్లాపాపలతో వచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు

Update: 2021-01-28 11:49 GMT

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల సన్నిధిలో గురువారం భక్తుల తాకిడి కనిపించింది. గురువారం సమ్మక్క గద్దెకు వచ్చే రోజు కావడంతో వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి సుదూర ప్రాంతాలైన కరీంనగర్, ఆదిలాబాదు, ఖమ్మం, ఛత్తీస్ ఘడ్, పాత ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పిల్లాపాపలతో తరలి వచ్చారు. ముందుగా జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి వనదేవతలను దర్శించుకున్నారు. తల్లుల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమలు సమర్పించుకున్న అనంతరం జంతు బలి గావించి మొక్కులు చెల్లించుకున్నారు.

Tags:    

Similar News