Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేషుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది తమిళిసై

Update: 2022-08-31 05:43 GMT

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

Khairatabad Ganesh: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాగణపతికి గవర్నర్ పూజ చేశారు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు తమిళిసై. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గణపయ్య దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలిసారి 50 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష మండపం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహాగణపతి దర్శనానికై భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Full View


Tags:    

Similar News