గవర్నర్‌కిచ్చే గౌరవం ఇదేనా? ఇదేం సంస్కృతి?: తమిళిసై
Tamilisai Soundararajan: రాజ్‌భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరచే ఉంటాయి: తమిళిసై
గవర్నర్‌కిచ్చే గౌరవం ఇదేనా? ఇదేం సంస్కృతి?: తమిళిసై
Tamilisai Soundararajan: రాజ్ భవన్ వేదికగా రాజకీయాలు చేయడంలేదని గవర్నర్ తమిళిసై స్పష్టంచేశారు. రాజ్ భవన్ ఎల్లవేళలా ద్వారాలు తెరచి ఉంటాయని ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరైనా... ఎప్పుడైనా రావొచ్చన్నారు. బాధ్యతగల గవర్నర్ గా తెలంగాణ ప్రజలకోసం పనిచేస్తున్నానని అన్నారు. రాజకీయాలు ఎవరు చేస్తున్నారు. అందరికీ ఆహ్వానాలు పంపినప్పటికీ.... రిపబ్లిక్ వేడుకలు ఎందుకు రాలేదు.? ముందస్తు ఉగాది వేడుకలకు ఎందుకురాలేదని ఆమె ప్రశ్నించారు. మహిళగా... గవర్నర్ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు.