Telangana: బిల్లులు ఆమోదంకోసం హైకోర్టును ఆశ్రయించనున్న సర్కారు
Telangana: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్
Telangana: బిల్లులు ఆమోదంకోసం హైకోర్టును ఆశ్రయించనున్న సర్కారు
Telangana: గవర్నర్ తమిళిసై తీరుపై హైకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. రాష్ట్ర బడ్జెట్ కు గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. దీంతో.. బడ్జెట్ కు గవర్నర్ ఆమోదంపై హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించబోతుంది. రాష్ట్ర బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించాలని.. కోర్టు మెట్ల ఎక్కనుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సరికొత్త రాజకీయ రాజ్యాంగ సంక్షోభం తలెత్తనుందా..? ఇంతకు రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య.. పెరిగిన అంతరం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని అంతుబట్టకుంది.
తెలంగాణ బడ్జెట్ప్రవేశానికి గవర్నర్నుంచి ప్రభుత్వానికి ఇంకా అనుమతి రాలేదు. 10 రోజుల క్రితమే గవర్నర్‌కు ప్రభుత్వం నుంచి లేఖ రాసినప్పటికీ ఇంకా అనుమతి లభించలేదు. దీంతో ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఆలోచనలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ శుక్రవారం నుంచే రాష్ట్ర బడ్జెట్సమావేశాలు జరగనున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూల్ప్రకారం శుక్రవారమే ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పరిణామాలు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.