హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 33వ నేషనల్ బుక్ ఫెయిర్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పుస్తకం చదవడం దిన చర్యగా ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని అన్నారు. తనను కలవడానికి వచ్చే వారు బుకీలు కాకుండా బుక్స్ తీసుకురావాలని సూచించారు. ప్రతి ఇంట్లో రీడింగ్ రూమ్ ఉండేలా చూసుకోవాలన్నారు.
అయితే నిత్యం తాను బీజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు పుస్తకం చదువుతానని గవర్నర్ తమిళిసై అన్నారు. అయితే గవర్నర్ తెలుగులో ప్రసంగించడం అందరిని ఆకట్టుకుంది. బుక్ ఫెయిర్ కి రావడం సంతోషంగా ఉందిని, అందరూ పుస్తకాలు చదవాలని అన్నారు. తాను ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు గంట పుస్తకం చదువుతానని తెలిపారు. గవర్నర్, రైటర్, డాక్టర్ అనిపించుకోవడం కంటే చదువరిగా ఉండటమే ఇష్టమన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న 330 స్టాల్స్ ని సందర్శించాలని గవర్నర్ తమిళిసై కోరారు. ఈ సందర్భంగా ఈకార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.