Tamilisai Soundararajan: కాసేపట్లో నల్లమల చెంచులతో గవర్నర్ సమావేశం
Tamilisai Soundararajan: ఆరోగ్య ఉప కేంద్రం, టైలరింగ్ శిక్షణ కేంద్రం, ఆశ్రమ పాఠశాల సందర్శన...
Tamilisai Soundararajan: కాసేపట్లో నల్లమల చెంచులతో గవర్నర్ సమావేశం
Tamilisai Soundararajan: కాసేపట్లో నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. నల్లమల పరిధిలోని చెంచుగూడెంలను ఆమె సందర్శించనున్నారు. మన్ననూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొంటారు. తర్వాత నల్లమలలోని అప్పాపూర్ పెంటకు చేరుకుంటారు.
అప్పాపూర్‌లో గవర్నర్‌కు చెంచులు సాంప్రదాయ నృత్యంతో స్వాగతం పలుకుతారు. ఆరోగ్య ఉపకేంద్రం, టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఆశ్రమ పాఠశాలను గవర్నర్ పరిశీలిస్తారు. ఎగ్జిబిషన్ స్టాల్స్ ,. చెంచుల దేవాలయం, చెంచుల గృహాలను సందర్శిస్తారు తమిళిసై. మధ్యాహ్నం 12 గంటలకు చెంచులతో సమావేశం అవుతారు.