hmtv ఆధ్వర్యంలో మాతృశక్తి అవార్డుల ప్రదానం.. చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

hmtv Matrushakti Awards 2025: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలకు hmtv మాతృశక్తి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Update: 2025-03-11 04:45 GMT

HMTV Matrushakti Awards 2025: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలకు hmtv మాతృశక్తి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మహిళలు అన్నిరంగాల్లో పురోగమించి సమాజ సేవలో భాగమవ్వడం దేశానికి ఎంతో మంచి జరుగుతుందన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో hmtv ఆధ్వర్యంలో మాతృశక్తి అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ చాటుతున్న ముగ్గురు మహిళలకు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్స్ అవార్డ్స్, 16 మందికి మాతృశక్తి అవార్డ్స్ ను అందించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.

Full View


Tags:    

Similar News