Telangana: ఒమిక్రాన్‌ నేపథ్యంలో మాస్క్‌లు తప్పనిసరి చేసిన తెలంగాణ

Telangana: మాస్క్‌లు తప్పనిసరి చేయడంతో రంగంలోకి పోలీస్‌శాఖ

Update: 2021-12-04 06:14 GMT
ఓమిక్రాన్ నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి చేసిన తెలంగాణ (ఫైల్ ఇమేజ్)

Telangana: కొత్తగా ఒమిక్రాన్‌ కల్లోలం నేపథ్యంలో మళ్లీ నిబంధనలన్నింటినీ పోలీసులు కఠినంగా అమలు చేయబోతున్నారు. కరోనా కట్టడి కోసం పోలీసుశాఖ అనేక ప్రయోగాలు చేసింది. మాస్కులు ధరించని వారిని గుర్తించి అప్రమత్తం చేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారు చేసింది. దీన్ని సీసీ కెమెరాకు అనుసంధానం చేసింది.

ఇది ఎక్కడైనా మాస్కులు ధరించని వారుంటే వెంటనే సమీపంలో పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేసేది. అలాగే ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలనూ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గమనించేవారు. జనం గుమిగూడే ప్రాంతాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సబ్‌డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

రెండో దశ కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొంత కాలంగా వీటిని పటిష్ఠంగా అమలు చేయడంలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ పోలీసుశాఖ అలర్ట్ అయ్యింది. ఒకేసారి కేసులు నమోదు చేయడం మొదలుపెడితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News