Nizamabad: షుగర్ ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు
Nizamabad: 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించిన యాజమాన్యం
Nizamabad: షుగర్ ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు
Nizamabad: నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సాధ్యాసాధ్యాల పరిశీలించి ప్రభుత్వం కమిటీ వేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 8ఏళ్లుగా మూతపడ్డ ఫ్యాక్టరీపై కార్మికులు, చెరుకు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్‌బాబు, కో చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహాలను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉన్నారు. 2015 డిసెంబర్ 23న లేఆఫ్‌గా నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది.