Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి గుడ్ న్యూస్
Ration Card
Ration Cards: రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లయ్ చేసుకున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే చాలు ఇతర స్కీముల ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందుకే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలన కింద అప్లయ్ చేశారు. ఇప్పుడు మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో మీరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకుని ఉంటే..గుడ్ న్యూస్. రేషన్ కార్డుల జారీపై కీలక అప్ డేట్ వచ్చింది. కరీంనగర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు..రేషన్ కార్డుల జారీపై స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి అవకాశం లేదు. అందుకే ఈ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియని తెలిపారు. కార్డుల కొత్తపేర్లు నమోదు లేదంటే పాత పేర్ల తొలగింపు వంటి సేవలు కూడా అందిస్తున్నామని ఇప్పటికే చాలా మంది వీటి కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. అందువల్ల కొత్త రేషన్ కార్డు జారీ అనేది ఈ నెల చివరి నుంచి లేదంటే మార్చి తొలివారం నుంచి ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇంకో 10 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి. ఇది సానుకూల అంశమని చెప్పవచ్చు.