Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..నేడు 1,532 మందికి నియామక పత్రాలు అందజేత

Update: 2025-03-12 01:30 GMT

Revanth Reddy: భారత పౌరుడిగా ఎంతో గర్వంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఎంపిక అయిన 1532 మంది అభ్యర్థులకు మార్చి 12,2025 నాడు నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేస్తుంది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మధ్య జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1292 మందిని ఎంపిక చేసింది. అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 240మందిని ఎంపిక చేసింది. ఈ నియామకాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూలలో మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది.

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కీలక విషయాలు చెప్పారు. కొత్తగా నియమితులయ్యే లెక్చరర్లకు విద్యాశాఖ విధానాలు, మోడ్రన్ టీచింగ్ పద్దతులపై స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ట్రైనింగ్ తర్వాత కాలేజీల్లో పోస్టింగ్స్ కేటాయిస్తామని తెలిపారర. ఈ కొత్త నియామకాలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. ఈ నియామకాలు రాష్ట్రలోని 27 సబ్జెక్టుల్లో 1392 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్దేశించినవి. ఈ ప్రక్రియ బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో 1139మందిని ఇదివరకే ఎంపిక చేశారు. కానీ ఈ నియామక పత్రాలు ఇవ్వలేదు. మెలిగిన వారితోపాటూ మరికొందరిని కలిపి మొత్తం 1532 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఈ చర్యతో తెలంగాణ విద్య వ్యవస్థ బలోపేతం కానుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News