గోదావరి మహా విశ్వరూపం.. ప్రళయ గంగలా పరవళ్లు

Bhadrachalam: నిన్న అర్ధరాత్రి 71.90 అడుగుల నీటిమట్టం

Update: 2022-07-16 05:19 GMT

గోదావరి మహా విశ్వరూపం.. ప్రళయ గంగలా పరవళ్లు

Bhadrachalam: గోదావరి మహావిశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రళయగంగలా పరవళ్లు తొక్కుతోంది. ఉరుకులు, పరుగులతో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. జూరాల నుంచి ధవళేశ్వరం వరకు అదే స్పీడ్, అదే జోరు. ఎక్కడా తగ్గకుండా ఉరకలేస్తోంది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంది. ఊళ్లను ముంచేస్తోంది.

ఇక భద్రాచలం వద్ద గోదావరి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి.. స్థానికుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 32 ఏళ్ల తర్వాత భద్రాద్రి వద్ద గోదావరి 71 అడుగుల నీటి మట్టాన్ని క్రాస్ చేసింది. అక్కడ మూడో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భద్రాచలం సమీపంలో ఉన్న 95 గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు వరదలతో అల్లాడిపోతున్నారు. 77చోట్ల పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20వేలకుపైగా మందిని సేఫ్‌ ప్లేస్‌కు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ పునరావస ప్రాంతాల వైపు కదులుతున్నారు. NDRF, సైనిక బృందాలలు రంగంలోకి దిగాయి.

అయితే ఉదయం నుంచి భద్రాచలం వద్ద గోదావరి కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. కొద్దిమేర వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు. ఉదయం 5గంటల నుంచి ఒక్కో పాయింట్‌ తగ్గుతూ వస్తోంది. నిన్న అర్థరాత్రి 71.30 అడుగులకు చేరిన నీటిమట్టం.. ఇవాళ ఉదయం వచ్చేసరికి 70.90 అడుగులకు చేరుకుంది.   

Tags:    

Similar News