భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం

*36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో మళ్లీ 70 అడుగులు దాటనున్న గోదావరి నీటిమట్టం

Update: 2022-07-15 05:41 GMT

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం

Bhadrachalam: గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో భద్రాచలం డేంజర్ జోన్‌లో పడింది. అంతకంతకూ నీటి ప్రవాహం కొనసాగుతోంది. 67 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 68 అడుగులకు చేరింది. గోదావరిలోకి 21 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 1986 తర్వాత ఈ స్థాయిలో గోదావరికి మొదటిసారి వరద పోటెత్తింది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు.. భద్రాచలం టౌన్‌, పరిసర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. మరో 48 గంటలు భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే 2వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తక్షణమే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. ఇప్పటికే కాలనీలోకి వరద చేరిందని, ఫ్లడ్‌ మాన్యువల్‌ ప్రకారం ఈ కాలనీ కూడా ముంపునకు గురయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. ప్రజలు జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Tags:    

Similar News