భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

Bhadrachalam: ప్రమాదకరస్థాయిలో నీటి ప్రవాహం

Update: 2022-07-15 02:45 GMT

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకరస్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరిలోకి 21 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 1986 తర్వాత ఈ స్థాయిలో గోదావరికి మొదటిసారి వరద పోటెత్తింది. దీంతో గోదావరి నీటిమట్టం 73 అడుగులు దాటే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే 36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటనుంది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు భద్రాచలం టౌన్‌, పరిసర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. మరో 48 గంటలు భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే 2వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Tags:    

Similar News