GHMC: అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌కు బల్దియా షాక్
GHMC: అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌కు బల్దియా షాక్ ఇచ్చింది.
GHMC: అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌కు బల్దియా షాక్
GHMC: అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌కు బల్దియా షాక్ ఇచ్చింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. 11 లక్షల 52 వేల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 49వేల రూపాయలు మాత్రమే అన్నపూర్ణ స్టూడియో చెల్లిస్తున్నట్టు తెలిపారు.
అలాగే.. లక్షా 92 వేల ఫీజు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్.. కేవలం 19 వందలు మాత్రమే చెల్లిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 అధికారులు వివరించారు. పూర్తిస్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌కు నోటీసులు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ.