హైదరాబాద్ లో గ్యాస్ సిలండర్ పేలుడు

హైదారాబాద్ సిటీలో అర్ధరాత్రి గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది.

Update: 2020-03-01 05:37 GMT

హైదారాబాద్ సిటీలో అర్ధరాత్రి గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. మలక్ పేటల అస్మన్ ఘడ్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి మంటలు అంటుకుని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మూడంతస్తుల భవనంలో గ్యాస్ సిలిండర్ లీక్ మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి ఇంటి తలుపులు, కిటికీల అద్దాలతో పాటు... ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఏం జరిగిందోనని స్థానికులు పరుగులు తీశారు.

తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన లక్ష్మయ్య, యాదమ్మ దంపతులు, మోక్షజ్ఞ, తేజస్వినిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునిమంటలు ఆర్పి వేశారు. పోలీసులు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News