Hyderabad: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఏపీ పోలీసులు.. అరెస్టు చేసిన సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్
Hyderabad: గంజాయి అమ్మకాలు చేస్తున్న కానిస్టేబుల్స్
Hyderabad: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఏపీ పోలీసులు.. అరెస్టు చేసిన సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్
Hyderabad: అసాంఘిక చర్యలను అడ్డుకోవాల్సిన పోలీసులే స్మగ్లర్లుగా మారారు. రాష్ట్రం దాటి గంజాయి స్మగ్లింగ్ చేశారు. హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలు జరుపుతూ అడ్డంగా బుక్కయ్యారు. బాచుపల్లిలో గంజాయి అమ్మకం చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు SOT పోలీసులు. పట్టుబడిన ఇద్దరు పోలీసులు..ఏపీఎస్పీ కాకినాడ థర్డ్ బెటాలియన్‌కి చెందిన.. హెడ్‌కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ వెళ్తున్నామని లీవ్ పెట్టిన ఈ ఇద్దరు కానిస్టేబుల్స్..గంజాయి అమ్మకాలు చేస్తూ పట్టుబడ్డారు.