నల్గొండ జిల్లాలో ముప్పై ఆరు లక్షలకు వినాయకుడు లడ్డు వేలం
Nalgonda: 36 లక్షలకు లడ్డును దక్కించుకున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తరపు కరణ్ జయరాజ్
నల్గొండ జిల్లాలో ముప్పై ఆరు లక్షలకు వినాయకుడు లడ్డు వేలం
Nalgonda: నల్గొండ జిల్లాలో అత్యధికంగా ముప్పై ఆరు లక్షలకు వినాయకుడు లడ్డు వేలం పాట పాడారు. నల్గొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్ నగర్ మొదటి నంబర్ వినాయకుడి లడ్డూకు ప్రతిఏటా భారీగా వేలం వస్తుంది. ఈసారి ఆ లడ్డూ వేలంకు రాజకీయ రంగు అలుముకుంది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లను ఛాలెంజ్ గా తీసుకుని... వారి తరపు వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నారు.
ఇక బీజేపి నేత నాగం వర్షిత్ రెడ్డి , పిల్లి రామారాజు యాదవ్‌లు వేలం పాటలో లడ్డూను ముప్పై లక్షలు దాటించగా... ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తరపున కరణ్ జయరాజ్ ముప్పై ఆరు లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు . లక్ష రూపాయల సవాల్ తో మొదలైన లడ్డూ 36 లక్షలకు వేలంలో పోవడంతో నిర్వహకులు ఆనందంలో ఉన్నారు.