నిర్మల్ జిల్లాలో వైభవంగా గణేశ్ నిమజ్జన వేడుకలు
Nirmal:నిమజ్జనం కోసం బాసర గోదావరిపై బారులు తీరిన గణనాథులు
నిర్మల్ జిల్లాలో వైభవంగా గణేశ్ నిమజ్జన వేడుకలు
Nirmal: నిర్మల్ జిల్లాలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనం వేడుక వైభవంగా జరిగింది. నిమజ్జనం కోసం వచ్చిన వాహనాలు బాసర గోదావరి నది బ్రిడ్జిపై బారులు తీరాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డిలోని పలు ప్రాంతాల నుంచి భారీగా విగ్రహాలను తరలించారు. అర్ధరాత్రి నుంచి భక్తులు విగ్రహాలను భారీగా తరలించారు. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ నుంచి వచ్చే విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేసిన అనంతరం బాసర నుంచి నయాగం కందకుర్తి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. గోదావరి నదిపై అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిజామాబాద్, నిర్మల్ జిల్లా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.