Gandhi Hospital Outsourcing Employees Withdraw Protest: సమ్మె విరమించిన గాంధీ సిబ్బంది.. ప్రభుత్వంతో చర్చలు సఫలం

Gandhi Hospital Outsourcing Employees Withdraw Protest: నగరంలోని కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్నగాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆరు రోజులుగా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

Update: 2020-07-15 14:39 GMT
Gandhi hospital out sourcing staff stops their protest after negotiations succeed

Gandhi Hospital Outsourcing Employees Withdraw Protest: నగరంలోని కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆరు రోజులుగా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బుధవారం ఔట్ సోర్సింగ్ సిబ్బందితో చర్చలు జరిపింది. కాగా ప్రభుత్వం వారితో జరిపిన చర్చలు ఎట్టకేల‌కు స‌ఫ‌ల‌ం కావడంతో గ‌త ఆరు రోజులగా నిరవధికంగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రకటించారు. తాము వెంటనే గాంధీ ఆస్పత్రిలో విధుల్లోకి చేరతామ‌ని ప్రభుత్వానికి తెలిపారు.

ఇక ప్రభుత్వం వారితో జరిపిన చర్చల్లో క‌రోనా విధుల్లో ఉన్నవారికి రోజువారీ ప్రోత్సాహకం కింద అదనంగా మరో రూ.750 ఇవ్వాల‌ని నిర్ణయించారు. అంతే కాక ఆస్పత్రిలో పనిచేస్తున్నన‌ర్సుల‌కు రూ.17,500ల నుంచి రూ.25 వేల‌కు వేత‌నాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ సిబ్బందిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతే కాక నాలుగో త‌ర‌గ‌తి సిబ్బందికి రోజుకు రూ.300 ఇన్సెంటివ్ కాగా, నెలలో 15 రోజులు డ్యూటీ చేసేలా వెసులుబాటు క‌ల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీల‌తో నర్సులు స‌మ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించారు.

ఇక పోతే సమ్మె చేసిన గాంధీ హాస్పిటల్ సిబ్బందిలో 620మంది ఉన్నారు. ఆందోళనలో నలుగు యునియన్ లకు చెందిన ఉద్యోగులు. ఫోర్త్ క్లాసు ఎంప్లాయిస్ - 220 మంది సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది - 200, పేషెంట్ కేర్ సిబ్బంది - 100, సెక్యూరిటీ సిబ్బంది 100 మంది. నాలుగో రోజుకు చేరుకున్న కాంట్రాక్టు నుర్సులు ఉన్నారు. 

Tags:    

Similar News