Telangana Speaker: అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ నామినేషన్.. బీఆర్‌ఎస్ మద్దతు
Telangana Speaker: స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
Telangana Speaker: అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ నామినేషన్.. బీఆర్‌ఎస్ మద్దతు
Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ తరపున కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం స్పీకర్ నామినేషన్ పత్రాలపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారు. గడ్డం ప్రసాద్ స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నికలకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. అటు ఎంఐఎం కూడా మద్దతును తెలియజేసింది. కాగా స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అటు స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.