Karimnagar: రూ.1కే అంతిమ సంస్కారం

Karimnagar: సహజ మరణ దహన సంస్కారానికి రూ.20-40 వేలు ఖర్చు

Update: 2021-04-28 10:08 GMT

అంతిమ యాత్ర రథం పైల్ ఫోటో

Karimnagar: ఒక చావు ఆ కుటుంబానికి ఎంతో పెద్ద తీరని లోటు. అదే ఓ పేదింట్లో మనిషిని కోల్పోయిన బాధ కన్నా ఆ చావు ధహనసంస్కారాలకయ్యే ఖర్చు గురించి తల్చుకుంటేనే దుఃఖం రెట్టింపు అవుతుంది. ఐతే కేవలం రూపాయితోనే అంతిమ యాత్రతో పాటు అంతిమ తంతు కూడా పూర్తి చేస్తున్నారు అక్కడ. రూపాయికే అంతిమ సంస్కారంతో పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్న వైనంపై హెచ్ ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్...

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో తెల్ల రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాల కోసం నగర పాలక సంస్థ తీసుకున్న నిర్ణయం అభినందనీయమైంది. అంతిమ సంస్కారానికి కేవలం ఒక రూపాయితోనే వైకుంఠ రథంతో పాటు అన్ని కులమత ఆచారాల ప్రకారం అంతిమ యాత్ర నిర్వహిస్తోంది. ఆ విధంగా పేద ప్రజల ఆత్మగౌరవాన్నీ పెంపొందిస్తోంది.

కరోనాతో చనిపోతే అయినవారే కాదు కన్నవారు కూడా కనీసం ఆ డెడ్ బాడీలను ముట్టుకునే పరిస్థితులు లేని ఈ సమయంలో... కరీంనగర్ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం అభినందనీయమైందని పలువురు కొనియాడుతున్నారు. ఆ మరణం దిక్కులేని అనాధ శవాలుగా మారితే ఆ శవాలకు కూడా కేవలం ఒక్క రూపాయితోనే అంతిమ యాత్ర వైకుంఠ రథంలో తరలించి అంతిమ సంస్కారానికి అసలైన అర్థం చెప్తున్న ఒక రూపాయి పథకం పట్ల అందరూ హర్షిస్తున్నారు.


Tags:    

Similar News