Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్ సైట్..ఇంట్లో నుంచే ఇలా తెలుసుకోవచ్చు.
Indiramma
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. పురపాలికలు, పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేదలు ఇందులో నమోదు చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు. కానీ తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక చాలా మంది పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఇందులో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
ఇందిరమ్మ లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం https://///indirammaindlu.gov.in/applicantsearch వెబ్ సైట్ ను రూపొందించింది. గూగుల్ లోకి వెళ్లి దీనిని ఓపెన్ చేసి తర్వాత ఆధార్ సంఖ్య ఎంటర్ చేయాలి. దీంతో దరఖాస్తు స్టేటస్ కనిపిస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. తర్వాత పేరు, అడ్రస్, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిర్యాదుల కేటగిరి ఆప్షన్ డ్యాష్ బోర్డుపై కనిపిస్తుంది. ఇక్కడ నొక్కగానే పలు సమాచారం కనిపిస్తుంది. ఇందులో దరఖాస్తుదారు ఎదుర్కొన్న సమస్యను ఎంచుకోవాలి. కింద ఉన్న బాక్స్ లో ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత స్థలం లేదా ఇతర ధ్రువపత్రాలు 2ఎంబీ పరిమాణం వరకు పీడీఎఫ్, పీఎన్జీ, జేపీజీ ఫార్మట్ అప్ లోడ్ చేసుకోవాలి. తర్వాత ఫిర్యాదు నెంబర్ వస్తుంది. దానిని భద్రపరిస్తే సమాచారం తెలిసిపోతోంది.