'త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి'... సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించిన ఫ్యూజీఫిల్మ్ ఇండియా
హైదరాబాద్, జూన్ 11, 2025: హెల్త్‌కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచిన ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా 'త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి' అనే సామాజిక బాధ్యత (CSR) ప్రచారాన్ని ప్రారంభించింది.
హైదరాబాద్, జూన్ 11, 2025: హెల్త్‌కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచిన ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా 'త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి' అనే సామాజిక బాధ్యత (CSR) ప్రచారాన్ని ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెల ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు, దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించాలన్న అవగాహనను ఈ కార్యక్రమం ద్వారా కల్పిస్తున్నారు.
ఈ ప్రచారాన్ని ప్రత్యేకించి మహిళలలో ఉన్న అపోహలు అధిగమించే దిశగా, ఆరోగ్యంపై సరైన సమాచారాన్ని అందించేందుకు రూపొందించారు. 24 నగరాల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని, మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఇది రూపొందించారు.
మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా అపోలో ఫౌండేషన్ చొరవ ఈ కార్యక్రమాన్ని అపోలో ఫౌండేషన్ అమలు చేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య సేవా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివార్ల బస్తీలను చేరుకుంటారు. అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, సాంస్కృతికంగా సున్నితమైన పద్ధతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వర్క్‌షాప్స్, చర్చలు, స్క్రీనింగ్ క్యాంపులు వంటి కార్యాచరణలతో మహిళలకు స్వీయ పరీక్షల అవసరాన్ని తెలియజేస్తారు.
ఈ సందర్భంగా ఉపాసనా కామినేని మాట్లాడుతూ.. “మహిళలు భయపడకుండా, గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోంది. ప్రతి 13 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చారిటీ కాదు, బాధ్యతగా చూడాలి. ఆరోగ్యంపై చర్చలు సామాన్యంగా జరగాలి. సెల్ఫ్ ఎగ్జామ్స్ కూడా తక్కువగా చూడకూడదు. మహిళలు ముందుగా స్క్రీనింగ్ చేయించుకునేలా ప్రోత్సహించాలి” అని సూచించారు. అరగొండలో నిర్వహించిన పైలెట్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 150 ప్రాణాలు కాపాడినట్టు ఆమె వెల్లడించారు.
ఫ్యూజీఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా మాట్లాడుతూ.. “త్వరగా గుర్తించడం వల్లే బ్రెస్ట్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా పోరాడవచ్చు. ఈ క్యాంపెయిన్ ద్వారా మహిళల్లో అవగాహన పెంచడం, తొలిదశలోనే స్క్రీనింగ్ చేయించడం, మానవ ప్రాణాలు రక్షించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఫ్యూజీఫిల్మ్ గ్రూప్ Sustainable Value 2030 ప్రణాళికకు అనుగుణంగా రూపొందించారు. ఆరోగ్యసేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు చేరాలన్నది ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యం. మారుమూల గ్రామమైనా, జనసాంద్రత కలిగిన నగరమైనా ప్రతి మహిళకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా పనిచేస్తామని ఫ్యూజీఫిల్మ్ ఇండియా వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అపోహలను అధిగమించి, ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. ఇది ఆరోగ్యంగా, ధైర్యంగా జీవించే సమాజం నిర్మాణానికి దోహదం చేస్తుంది.