షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడు షాపింగ్ వెళ్లినా వేలకు వేలు ఖర్చు పెడుతున్నారా? అయితే ఈ సంస్ధ వారు ప్రకటించిన బంపర్ ఆఫర్ ను వినియోగించుకొండి. ఫ్యాషన్ డిపార్ట్మెంటల్ స్టోర్ సెంట్రల్లో వినియోగదారులు ఒక్క రోజు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు. శనివారం మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రూ.6 వేల వరకు కొనుగోళ్లపై వినియోగదారులు రూ.3 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అంతే మొత్తాన్ని సెంట్రల్ క్యాష్ కూపన్ల రూపంలో వినియోగదారులు తిరిగి పొందొచ్చు.
ఇంకా అమెరికన్టూరిస్టర్స్ రూ.8800 విలువ చేసే విఐపి లగేజ్ బ్యాగ్ ల ను 1999 రూ, లకే పొందవచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్/క్రెడిట్ కార్డులతో మరింత రాయితీ పొందొచ్చని వివరించింది. అయితే ఈ ఆఫర్ కేవలం శనివారం ఒక్కరోజే అని స్పష్టం చేసింది. మొత్తానికి ఈ బంపర్ ఆఫర్ ప్రకటించడంతో జనాలు సెంట్రల్ మాల్స్ వద్ద క్యూకడుతున్నారు జనాలు. ఇలాంటి ఆఫర్ మళ్లీ పోతే రాదు అని జనాలు తెగ సంబురపడుతున్నారు.