Telangana: తెల్లరేషన్‌కార్డు దారులకు ఉచితంగా రేషన్ బియ్యం

Telangana: ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున అందజేయాలని సీఎం నిర్ణయం

Update: 2021-05-10 05:15 GMT
తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచిత రేషన్ 

Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదే విధంగా ప్రైవేట్ టీచర్లకు అందించే సాయాన్ని మరో 80వేల మందికి అందించనున్నట్లు వెల్లడించారు. రాష‌్ట్రంలో దాదాపు లక్షా 20 వేల మంది బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు 2వేల రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన మరో 80వేల మంది ప్రైవేట్ టీచర్లకు, సిబ్బందికి కూడా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Tags:    

Similar News