Nizamabad: వివాహిత ఘరానా మోసం.. వధువుగా పరిచయమై.. యువకుడి నుంచి రూ.4లక్షలు వసూలు
Nizamabad: ఇంట్లో సమస్యలు ఉన్నాయని పలుమార్లు డబ్బు వసూలు.. అనుమానం వచ్చి విచారణ చేయగా బయటపడ్డ మోసం
Nizamabad: వివాహిత ఘరానా మోసం.. వధువుగా పరిచయమై.. యువకుడి నుంచి రూ.4లక్షలు వసూలు
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఘరానామోసం వెలుగులోకి వచ్చింది. సాలురా గ్రామానికి చెందిన ఓ యువకుడికి వివాహిత గాలం వేసింది. పెళ్లి పేరుతో యువకుడి నుంచి 4లక్షల రూపాయలు వసూలు చేసింది. మ్యాట్రిమొనీ ద్వారా యువకుడికి పరిచయమైన విశాఖకు చెందిన స్వాతి.. ఇంట్లో సమస్యలు ఉన్నాయని యువకుడి నుంచి పలుమార్లు డబ్బు వసూలు చేసింది. అయితే.. యువకుడిని అనుమానం వచ్చి విచారణ చేయగా మోసం బయటపడింది. వివాహిత అని తెలిసి ఖంగుతిన్న బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వివాహితకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నట్టు సమాచారం.