Renuka Chowdhury: అయోధ్యలో రామాలయం పూర్తి కాకుండానే.. ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా బాధకరం
Renuka Chowdhury: సోనియా నిర్ణయం వచ్చే వరకు ఎవరు అభ్యర్థి కాదు
Renuka Chowdhury: అయోధ్యలో రామాలయం పూర్తి కాకుండానే.. ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా బాధకరం
Renuka Chowdhury: బీజేపీపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామాలయం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా బాధకరమని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన పీఠాధిపతులు వద్దన్న ..బీజేపీ నాయకులు ఎన్నికల కోసమే రామాలయాన్ని ముందస్తుగా ప్రారంభిస్తున్నారని విమర్శించారు. భద్రాచలం రామయ్య సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు మాత్రమే ఖమ్మం ఎంపీ సీట్ అడిగే హక్కు ఉందని రేణుకా చౌదరి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే సంతోషం అన్నారు. సోనియా గాంధీ నిర్ణయం వచ్చే వరకు ఎవరు అభ్యర్థి కాదన్నారు.