జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

మండలంలో జంతు సంరక్షణ కెంద్రం ఏర్పాటు చెయడం అభినందనీయమని మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Update: 2019-12-15 11:10 GMT
కల్వకుంట్ల కవిత, ఎంపీ జి. రంజీత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

శంకర్ పల్లి: మండలంలో జంతు సంరక్షణ కెంద్రం ఏర్పాటు చెయడం అభినందనీయమని మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శంకరపల్లి మండలంలోని మిర్జాగుడలో జంతు సంరక్షణ కేంద్రాన్ని అమె చేవెళ్ల ఎంపీ జి. రంజీత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యేకాలె యాదయ్యతో కలిసి ఆమె ప్రారంభిoచారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... నగరానికి చేరువలో ఉన్న మిర్జాగుడలో జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో, పరిసర ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వారు అన్నార.

ఈ సందర్బంగా జంతు సంరక్షణ కేంద్రం వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధికార ప్రతినిథి మిర్జాగుడ సర్పంచ్ గౌండ్ల రవీందర్, గౌడ్, శంకరపల్లి వైస్ ఎంపీపీ కుర్మా రాములమ్మ, కె. వెంకటేశ్ అధ్వర్యంలో మిర్జాగుడ గ్రామస్తులు మాజీ ఎంపీ కవిత ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, జనవాడ సర్పంచ్ గౌడి చర్ల నర్సిమ్మ, మిర్జాగుడ ఉప సర్పంచ్ శాంతి బాయ్ కిషణ్ సింగ్, శంకరపల్లి మండల నాయకులు వసుదేవ్ కన్న, శ్రీనాథ్ గౌడ్, పాపారావు, ప్రవీణ్, సురేంధర్ రెడ్డి, శారద, తదితరులు పాల్గొన్నారు. 



Tags:    

Similar News