Praneet Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్

Praneet Rao: ప్రణీత్‌రావును అరెస్ట్‌ చేసిన పంజాగుట్ట పోలీసులు

Update: 2024-03-13 02:41 GMT

Praneet Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్

Praneet Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్ అయ్యారు. ప్రణీత్‌రావును సిరిసిల్లలోని అతని నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్లు ప్రణీత్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా ప్రణీత్‌రావు పనిచేశారు. SIBలో ప్రణీత్‌రావుకు సహకరించిన అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. SIB అడిషనల‌్‌ ఎస్పీ రమేష్‌ ఫిర్యాదు మేరకు ప్రణీత్‌రావుతో పాటు మరికొందరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్‌రావును అధికారులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Tags:    

Similar News