YS Jagan: నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ సీఎం జగన్‌

YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు జగన్.

Update: 2025-11-20 05:56 GMT

YS Jagan: నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ సీఎం జగన్‌

YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు జగన్. విజయవాడ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జగన్‌.. ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం.. రోడ్డుమార్గాన నేరుగా నాంపల్లి సీబీఐ కోర్టుకు బయల్దేరారు జగన్. కాసేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో విచారణకు హాజరుకానున్నారు.

ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్‌. అయితే.. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్‌ తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇవాళ మళ్లీ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత విచారణకు జగన్‌ హాజరుకానున్నారు. మరోవైపు.. జగన్‌ విచారణ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్‌ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సీబీఐ కోర్టు పరిసరాల్లోని రోడ్లను మూసివేశారు.

Tags:    

Similar News