Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాను వణికిస్తున్న చిరుతపులి ఆటకట్టు

Asifabad: ఆసిఫాబాద్ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులను అధికారులు ఎట్టకేలకు బంధించారు.

Update: 2025-11-12 06:01 GMT

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాను వణికిస్తున్న చిరుతపులి ఆటకట్టు

Asifabad: ఆసిఫాబాద్ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులను అధికారులు ఎట్టకేలకు బంధించారు. గత కొన్నిరోజులుగా తిర్యాని మండలంలోని గోండుగూడ, తీయగూడ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇటీవల చిరుత దాడిలో పలు ఆవులు మృతిచెందాయి. గ్రామ పరిసర ప్రాంతాల్లోకి మేతకు వెళ్లిన ఆవులపై పులి దాడి చేసి చంపిందని గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

గ్రామస్తులు అడవి వైపు వెళ్లొద్దని అటవీ అధికారులు కోరారు. దీంతో వేట కొనసాగించిన ఫారెస్ట్ ఆఫీసర్స్ రెండ్రోజుల్లో 5 పులులను బంధించారు. అందులో ఇద్దరు రైతులను చంపిన పులి కూడా ఉంది. చిమూర్ అటవీ ప్రాంతంలో ఒకటి, సావ్లీ అటవీ ప్రాంతంలో మరో 4 పులులను బంధించారు.

Tags:    

Similar News